బాలీవుడ్లో విభిన్న కథలు చేసేవారిలో హీరో ఆయుష్మాన్ ఖురానా ముందుంటాడు. 'అంధాదున్', 'ఆర్టికల్ 15', 'డ్రీమ్‌గర్ల్' వంటి సినిమాలతో గతేడాది ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్'తో థియేటర్లలోకి వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా నేడు(శుక్రవారం) విడుదలైన ఈ చిత్రాన్ని దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రం నిషేధించారు.
![Shubh Mangal Zyada Saavdhan scenes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6157130_subh-mangal.jpg)
ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటే ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ. అయితే ఈ సినిమాకు అరబ్ ప్రభుత్వం అడ్డు చెప్పింది. నిర్మాతలు కొన్ని సన్నివేశాలను కత్తిరిస్తామని చెప్పినా హోమో సెక్సువల్ కథ కాబట్టి బ్యాన్ చేశారు.
ఇందులో ప్రధాన పాత్రలైన కార్తిక్, అమన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు, 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' తరహా ట్రైన్ ఎపిసోడ్, అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని తాను ప్రేమించిన కార్తిక్ కోసం అమన్ పరిగెత్తుకుంటూ రావడం లాంటి సన్నివేశాలు ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">