ETV Bharat / sitara

నెటిజన్లకు కొత్త విషయం నేర్పుతున్న శ్రుతి - శ్రతిహాసన్​ హులా హూప్‌ ట్యోటోరియర్ వీడియో

కరోనా లాక్​డౌన్ సమయం​లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన నటి శ్రుతి హాసన్, 'హులా హూప్‌' పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా నడుముతో రింగ్​ను ఎలా తిప్పాలో నేర్పిస్తోంది.

Shruti Hassan Hula Hoop turorial video viral
శ్రుతిహాసన్​
author img

By

Published : Apr 15, 2020, 11:22 AM IST

దేశంలో విధించిన లాక్​డౌన్​ వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పలురకాల వీడియోలు, ఫొటోలు పోస్టులు పెడుతూ నెటిజన్లను అలరిస్తున్నారు. ఈ తరహాలోనే హీరోయిన్ శ్రుతి హాసన్ ఓ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది. నడుమును ఉపయోగించి, రింగ్​ తిప్పడం ఎలానే నేర్పిస్తోంది.

"హులా హూప్‌ ట్యోటోరియల్, ఇక్కడ బాగా జనాదరణ పొందింది" అంటూ దానికి ట్యాగ్‌లైన్‌ జోడించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. హీరో‌ రవితేజతో కలిసి 'క్రాక్' సినిమాలో నటిస్తుంది. షూటింగ్ చివరిదశలో ఉంది. మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. కరోనా ప్రభావంతో ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. దీంతోపాటే తమిళంలో 'లాభం' అనే చిత్రం చేస్తుంది. ఇందులో విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సాయి ధన్షిక తదితరులు నటిస్తున్నారు.

ఇదీ చూడండి : వైరస్‌ల ముప్పును ఆవిష్కరించిన సినిమాలెన్నో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.