ETV Bharat / sitara

పవన్-శ్రుతి.. హ్యాట్రిక్ కాంబినేషన్​ రెడీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అంజలితో పాటు శ్రుతిహాసన్ కూడా నటిస్తున్నట్లు స్పష్టమైంది. కానీ శ్రుతి ఏ పాత్రలో నటిస్తుందో క్లారిటీ లేదు.

author img

By

Published : Jul 20, 2020, 11:51 AM IST

పవన్-శ్రుతి.. హ్యాట్రిక్ కాంబినేషన్​ రెడీ
పవన్-శ్రుతి.. హ్యాట్రిక్ కాంబినేషన్​ రెడీ

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. హిందీ 'పింక్'​కు రీమేక్​గా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటో లీకై నెట్టింట హల్​చల్ చేసింది. అందులో పవన్​తో పాటు నటి అంజలి కూడా ఉంది. దీంతో ఈ చిత్రంలో అంజలి నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. కానీ ఈ సినిమాలో పవన్ తర్వాత ఏ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తుందనే విషయమై స్పష్టత లేదు. తాజాగా దీనిపై శ్రుతి హాసన్ స్పందించింది.

'వకీల్‌ సాబ్‌' చిత్రంలో తను ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు శ్రుతి హాసన్‌ వెల్లడించింది. తన పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి మాత్రం ఆమె నిరాకరించింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. శ్రుతి హాసన్‌ది 'పింక్‌' సినిమాలో తాప్సీ పోషించిన పాత్ర కాదట. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు భార్య పాత్రలో శ్రుతి‌ కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

పవన్‌ కల్యాణ్‌తో కలిసి శ్రుతి హాసన్‌ నటిస్తున్న మూడో చిత్రమిది. ఇది వరకు 'గబ్బర్‌సింగ్‌', 'కాటమరాయుడు' చిత్రాల్లో ఇద్దరు కలిసి నటించారు. 'వకీల్‌ సాబ్‌'చిత్రం టీజర్‌ను పవన్‌ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 2న విడుదల చేయనున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.