'జెర్సీ' చిత్రంతో తెలుగువారికి చేరువైన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా ఓ హీరో వివాహం గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఇటీవల తన ప్రేయసి నటాషా దలాల్‌ను వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జనవరి 24న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీంతో వరుణ్-నటాషా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రద్ధా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
"మరో మంచి నటుడు పెళ్లి అనే ఊబిలోకి దిగాడు. ఇకపై అతన్ని మనం ఎక్కువ శాతం ఆన్‌స్క్రీన్‌పై చూడలేకపోవచ్చు. సినిమాలో భాగంగా ఈ హీరో వేరే హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తే.. అతని భార్య, అత్తవారింటి వాళ్లు ఒప్పుకోకపోవచ్చు. పురుష ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే ఇకపై అతను నటిస్తాడా?. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో?. కొంచెం కష్టమే. కాబట్టి ఆయన్ని మనం మిస్ కానున్నాం. కంగ్రాట్స్ వరుణ్" అని శ్రద్ధా శ్రీనాథ్ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం ఈపోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రద్ధ చేసిన ఈ విభిన్నమైన పోస్ట్ పట్ల పలువురు పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొంతమంది మాత్రం ఇదేం విషెస్.. అనుకుంటున్నారు.