ETV Bharat / sitara

Shraddha kapoor: 'సాహో' బ్యూటీ పెళ్లి- స్పందించిన తండ్రి! - bollywood updates

బాలీవుడ్​ బ్యూటీ శ్రద్ధా కపూర్​ పెళ్లి మరోసారి హాట్​ టాపిక్​గా మారింది. బాయ్​ఫ్రెండ్​గా పేర్కొంటున్న రోహన్​ శ్రేష్ఠను శ్రద్ధా (shraddha kapoor and rohan shrestha) త్వరలోనే వివాహం చేసుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వదంతులపై శ్రద్ధా తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

shraddha kapoor marriage with rohan shrestha
'సాహో' బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కనుందా?
author img

By

Published : Aug 30, 2021, 2:40 PM IST

బాలీవుడ్​ భామ శ్రద్ధా కపూర్​ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందా? ప్రస్తుతం బాలీవుడ్​ వర్గాల్లో ఇదే విషయం హాట్​ టాపిక్​గా మారింది. శ్రద్ధా, రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్​ (shraddha kapoor and rohan shrestha) మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ ఇప్పటికే బీటౌన్​లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లపై శ్రద్ధా కానీ, ఆమె బాయ్​ఫ్రెండ్​గా పేర్కొంటున్న రోహన్​ కానీ.. ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే వీరి రిలేషన్​పై శ్రద్ధా సన్నిహితులు హింట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇటీవల శ్రద్ధా కజిన్​.. ప్రియాంక్​ శర్మ చేసిన వ్యాఖ్యలతో శ్రద్ధా-రోహన్​ల వివాహం గురించి చర్చ మరోసారి ఊపందుకుంది. శ్రద్ధా-రోహన్​ల రిలేషన్​ గురించి తనకు తెలియదని.. కానీ వారు వివాహం చేసుకుంటే చూడాలని ఉందన్నాడు. దీంతో వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని పుకార్లు పుట్టాయి.

అయితే ఈ పుకార్లపై శ్రద్ధా తండ్రి శక్తి కపూర్ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో​ స్పందించారు. శ్రద్ధా-రోహన్​ల గురించి వస్తున్న పుకార్లను తోసిపుచ్చారు. శ్రద్ధాతో పెళ్లి గురించి రోహన్​.. ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన తేలేదని స్పష్టం చేశారు. అతను తమకు ఫ్యామిలీ ఫ్రెండ్​ అని, తరచూ తమను కలుస్తూ ఉంటాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రద్ధా ఆమె కేరీర్​పైన దృష్టి సారించిందని తెలిపారు.

ప్రస్తుతం శ్రద్ధా.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. నాగిన్, స్త్రీ 2, చాల్​బాజ్​ ఇన్​ లండన్​ చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చదవండి : New movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.