Shraddha Kapoor: సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో బ్రేకప్ కహానీలు మరీ ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రియుడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్ రోహన్ శ్రేష్టతో నాలుగేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ అతడి నుంచి విడిపోయినట్టు సమాచారం. దీనిపై ఇంతవరకు ఇద్దరూ స్పందించలేదు. గత కొన్నాళ్లుగా ఫొటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ట- శ్రద్ధ ప్రేమలో మునిగి తేలారు. పార్టీలు, పబ్‌లు, టూర్స్ అంటూ పలుమార్లు మీడియాకు చిక్కిన వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో వార్తలు వినిపించాయి.
ఇటీవలే గోవాలో శ్రద్ధా కపూర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితులు, సన్నిహితులు అంతా హజరయ్యారు. కానీ ప్రియుడు రోహన్ మాత్రం రాలేదు. సోషల్ మీడియాలో కూడా రోహాన్ బర్త్‌డే విషెస్ చెప్పలేదు. కాగా, సోషల్ మీడియాలో శ్రద్ధ బ్రేకప్‌పై జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఔర్ సునావో(ఇంకా వినిపించండి) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
సాహో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన శ్రద్ధా కపూర్.. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు'చాల్ బాజ్'..'నాగిన్' సినిమాలు శ్రద్ధ చేతిలో ఉన్నాయి.
ఇదీ చదవండి: 'ప్రభాస్, సమంతతో గొడవలు'.. గుట్టు విప్పిన పూజ!