నటుడు శివాజీరాజా తనయుడు విజయ రాజా హీరోగా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ ‘'జెమ్'’ మూవీని రామనాయుడు స్టూడియోలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు హాజరై బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించే ఈ చిత్రానికి సుశీల సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ రాజాకు జంటగా రాశి సింగ్ నటిస్తుంది.

అజయ్, యస్. వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నటుడు అజయ్, ఉత్తేజ్, సంపూర్ణేష్ బాబు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
ప్రారంభ సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించిన ఎస్వీ కృష్ణారెడ్డి.. స్క్రిప్ట్‌ను దర్శకుడు సుబ్రమణ్యంకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

