తన భర్త రాజ్ కుంద్రా అరెస్టయిన తర్వాత.. బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి తొలిసారి సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టారు. సవాళ్లను తట్టుకొని జీవితాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ మేరకు అమెరికన్ రచయిత జేమ్స్ థర్బర్ పుస్తకంలోని వాక్యాలను ఉటంకిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్టును ఉంచారు. "కోపంతో వెనక్కి తిరిగి చూడొద్దు. కానీ అప్రమత్తంగా ఉంటూ.. భయంతో ముందుకు సాగిపో" అని అందులో ఉంది.
"కోపంతో గతాన్ని చూడటం, భయంతో భవిష్యత్తును చూడటం తగదు. స్పష్టమైన అవగాహనతో అన్నింటిని అర్థం చేసుకోవాలి. మనల్ని బాధపెట్టిన వారిని మనం కోపంతో చూస్తాం, ఉద్యోగం పోతుందానో, ఏదైనా వ్యాధి సోకుతుందనో, మనం ప్రేమించేవాళ్లు మరణిస్తారనో.. ఇలా భయంతో జీవిస్తాం. కానీ గతం, భవిష్యత్తు కన్నా.. వర్తమానంలో ఉండటం ముఖ్యం. ఈ క్షణం చాలా ముఖ్యం. ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని భయపడకూడదు. నేను బ్రతికి ఉండటాన్ని గొప్పగా భావిస్తున్నాను. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డాను, భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోగాలను. నా జీవితాన్ని ఏదీ దెబ్బతీయలేదు."
-శిల్పాశెట్టి పోస్ట్‌లోని వ్యాఖ్యలు
అశ్లీల చిత్రాల కేసులో జులై 19 రాత్రి రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
లండన్‌కు చెందిన ఓ కంపెనీతో పార్ట్నర్గా ఉన్న రాజ్ కుంద్రా.. 'హాట్‌షాట్స్' యాప్ ద్వారా అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వెబ్ సిరీస్‌ల్లో అవకాశాల పేరు చెప్పి, న్యూడ్ సన్నివేశాల్లో నటించేలా చేస్తున్నారని మోడల్ సాగరిక.. కుంద్రాపై ఆరోపణలు చేసింది.
ఇవీ చదవండి: