ETV Bharat / sitara

సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చిన శిల్పాశెట్టి - actress shilpa shetty

నటి శిల్పాశెట్టి మరోసారి తల్లయింది. సరోగసి విధానం ద్వారా ఈరోజు ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్​స్టాలో రాసుకొచ్చింది.

సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చిన శిల్పాశెట్టి
నటి శిల్పాశెట్టి కుటుంబం
author img

By

Published : Feb 21, 2020, 4:27 PM IST

Updated : Mar 2, 2020, 2:08 AM IST

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. మరోసారి మాతృత్వ అనుభవాన్ని పొందింది. ఈరోజు ఉదయం తమకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు చెప్పింది. ఈ విషయాన్ని ఇన్​స్టాలో పోస్ట్​ చేసిందీ భామ. పాపకు 'సమిశ శెట్టి' అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది.

"ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిఫలంగా ఓ అద్భుతం జరిగింది. గుండెల నిండా ఆనందంతో మా చిట్టితల్లిని ఆహ్వానిస్తున్నాం. సమిశ శెట్టి కుంద్రా ఈరోజు పుట్టింది" -శిల్పాశెట్టి, నటి

Shilpa Shetty insta post
శిల్పాశెట్టి కూతురు ఫొటో
Shilpa Shetty insta post
శిల్పాశెట్టి ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్

నటి శిల్పాశెట్టికి ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజ్ కుంద్రాతో 2009లో వివాహమైంది. 2012 మేలో వీరికి కొడుకు అయాన్ పుట్టాడు. ఇప్పుడు సరోగసి విధానం ద్వారా పాపకు తల్లిదండ్రులు అయ్యారు.

90వ దశకం నుంచి సినీ ప్రేక్షకుల్ని అలరించిన శిల్పా.. పెళ్లి తర్వాత నటనకు గుడ్​బై చెప్పేసింది. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత 'నిక్కమ్మ' చిత్రంతో బాలీవుడ్​లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ ఏడాది జూన్​లో థియేటర్లలోకి రానుందీ సినిమా. దీనితో పాటే 'హంగామా 2'లోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ.

Last Updated : Mar 2, 2020, 2:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.