శర్వానంద్, 'గ్యాంగ్‌లీడర్' ఫేం ప్రియాంక అరుళ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'శ్రీకారం'. కిషోర్ రెడ్డి దర్శకుడు. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. త్వరలోనే దీన్ని తిరిగి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
"వ్యవసాయం, రైతన్నల ప్రాధాన్యతను తెలియజేసే కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. శర్వానంద్ రైతుగా కనిపిస్తారు. ఇంకా 20 రోజుల చిత్రీకరణ మిగిలుంది. సెప్టెంబరు ఆఖరి వారం నుంచి తిరిగి చిత్రీకరణ ప్రారంభించనున్నాం. ప్రస్తుతం పాటల పని పూర్తవుతోంది. మిక్కీ జె.మేయర్ సంగీతం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ" అని చిత్రబృందం తెలిపింది.
ఈ సినిమాతో పాటు అజయ్ భూపతితో చేయాల్సిన 'మహా సముద్రం' సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలోనూ ఓ సినిమా పట్టాలెక్కించనున్నాడు శర్వానంద్.