Sharukhan Mannat Bomb threats: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బంగ్లా మన్నత్‌కు ఇటీవల బాంబు బెదిరింపులు రావడం బీటౌన్‌లో కలకలం రేపింది. అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఫోన్‌కాల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన వ్యక్తిగా అతడిని గురించినట్లు అధికారులు వెల్లడించారు.
"నిందితుడి పేరు జితేశ్ ఠాకూర్. అతడు నిరుద్యోగి. మద్యానికి బానిసై పలుసార్లు ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తుంటాడు. గత కొద్ది రోజులుగా అతడు షారుక్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతున్నాడు" అని అధికారులు పేర్కొన్నారు.
జనవరి 6న జితేశ్.. మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి, షారుక్ బంగ్లా సహా ముంబయిలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడికి పాల్పడబోతున్నట్లు బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సదరు ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో షారుక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో పలు హీరోలకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ సమయాల్లోనూ అప్రమత్తమైన పోలీసులు వాటిని ఫేక్ కాల్స్‌గా గుర్తించారు. కాగా, షారుక్ త్వరలోనే 'పఠాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్.
ఇదీ చూడండి: జిమ్‌లో సమంత వర్కవుట్స్ అదుర్స్- జుకల్కర్పై ఫన్నీ కామెంట్!