మరుగుజ్జు పాత్రలో షారూఖ్ ఖాన్ నటించిన చిత్రం 'జీరో'. ఈ సినిమా బీజింగ్ అంతర్జాతీయ చిత్రోత్సవానికి ఎంపికైంది. ఆనంద్ ఎల్.రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈనెల 13 నుంచి 20 వరకూ జరిగే ఈ వేడుకలో ముగింపు చిత్రంగా ప్రదర్శితం కానుంది జీరో. కత్రినా కైఫ్, అనుష్క శర్మ, నాయికలుగా నటించిన ఈ సినిమా గత డిసెంబరులో భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ చిత్రంలోని విభిన్నమైన కథాంశానికి, షారూఖ్ నటనకు ప్రశంసలు దక్కాయి.
ఇవీ చూడండి.. 'పీఎం నరేంద్ర మోదీ' విడుదల వాయిదా