ETV Bharat / sitara

నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం' - కె విశ్వనాథ్​

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన కళాత్మక దృశ్య కావ్యం 'శంకరాభరణం'. 1980, ఫిబ్రవరి 2లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ కళాఖండం విడుదలై భాషా ఎల్లలు దాటి ఎంతమందికో అభిమాన చిత్రంగా నిలిచింది. కళా తపస్వి కె.విశ్వనాథ్​ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు, మరెన్నో గౌరవాలు లభించాయి. విదేశాల్లో జరిగిన చిత్రోత్సవాల్లో సైతం కీర్తి పతకం సాధించింది. ఈ సినిమా విడుదలై 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం.

Shankarabharanam telugu movie Completed 40 years
నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం!
author img

By

Published : Feb 2, 2020, 6:01 AM IST

Updated : Feb 28, 2020, 8:38 PM IST

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం, 'శంకరాభరణం' చిత్రం విడుదలయ్యి నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యింది. 1980, ఫిబ్రవరి 2న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం విడుదలయ్యింది. కళాతపస్వి శ్రీ కే. విశ్వనాథ్​ దర్శకత్వంలో, పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద నాగేశ్వరరావు - ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ చిత్రం ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించింది . అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి తెలుగు చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలుమూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలయ్యి, తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఈ చిత్రం. ఆ రోజుల్లో ఎవరి నోట విన్న శంకరాభరణం గురించే ప్రస్తావన. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవైన రోజుల్లో.. ఈ చిత్రం విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు. ప్రతి తెలుగు వాడు మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.

Shankarabharanam telugu movie Completed 40 years
శంకరాభరణం చిత్రం గోడప్రతి

ఇక అవార్డుల విషయానికి వస్తే, జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో జనరంజక చిత్రంగా 'స్వర్ణ కమలం' అందుకుంది. స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రమిదే కావటం విశేషం. అలాగే గాయకులు శ్రీ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకునిగా తొలి సారి జాతీయ అవార్డు , శ్రీమతి వాణి జయరాం కు ఉత్తమ గాయకురాలిగా, శ్రీ కే.వి.మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఫ్రాన్స్) లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు 8 గెలుచుకుంది. ఇక దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి. ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శంకరాభరణం చిత్రంపై మూడు రోజులు ప్రవచనాలు చేశారు. అలా ఓ చిత్రంపై ప్రవచనం నిర్వహించటం అదే మెదటి సారి.

శంకరాభరణం చిత్రానికి బంగారు కమలం పురస్కార పత్రం

ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చిందీ చిత్రం. జె.వి. సోమయాజులు గార్ని అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు. అలాగే వాంప్ పాత్రలు ఎక్కువగా చేసే మంజు భార్గవి చాలా పవిత్రమైన తులసి పాత్రలో లీనమైపోయింది. ప్రముఖ హాస్య నటులు శ్రీ అల్లు రామలింగయ్య ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర పాటలు ఇప్పటికీ భాషతో సంబంధం లేకుండా అందర్ని ఆకట్టుకుంటాయి. ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై, హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు.

శంకరాభరణం చిత్రంలో శివుని ఆలయంలో జరిగే ఆసక్తికర సన్నివేశం

కథేమిటి?

శంకరశాస్త్రి (జె. వి. సోమయాజులు) గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వేశ్య కూతురు, గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తూలనాడిన విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. ఈ కేసు నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి శంకర శాస్త్రి అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో తులసిని విడిపిస్తాడు. వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూస్తారు.

నర్తకి తులసిగా నటించిన మంజు భార్గవి

తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక పుత్రుడికి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర నేర్చుకోవడానికి అతన్ని పంపిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును ఆయన సంగీతానికి వారసుడిగా నియమిస్తుంది. కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ఆమె కూడా ప్రాణాలువిడుస్తుంది.

ఓ సన్నివేశంలో సోమయాజులు, అల్లు రామలింగయ్య

నటీ నటులు
జె.వి .సోమయాజులు
మంజు భార్గవి
అల్లు రామలింగయ్య
చంద్ర మోహన్
రాజ్యలక్ష్మి
తులసి

శంకరాభరణం చిత్రీకరణలో దర్శకుడు కె.విశ్వనాథ్​

నేపథ్య గానం
ఎస్ .పి.బాలసుబ్రహ్మణ్యం
ఎస్. జానకి
వాణి జయరాం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
FAO HANDOUT - AP CLIENTS ONLY
Rome - 1 February 2019
1. A car convoy entering the grounds of the Food and Agriculture Organization of the United Nations (FAO) headquarters
2. Alberto Fernández, President of Argentina, getting out of car and greeting Qu Dongyu, FAO Director General
3. Fernández and Dongyu walking into the building
4. Various of Fernández and Dongyu shaking hands and posing of photographs
5. Various of Fernández and Dongyu talking inside a meeting room
6. Fernández and Dongyu seated in a meeting room with their respective delegations
7. SOUNDBITE (Spanish) Alberto Fernández, President of Argentina:
"FAO is a very important organization at the global level. In Argentina, we have a food issue, a hunger issue, a food security and nutrition issue. FAO has a lot to offer in terms of expertise and collaboration."
8. Various of Fernández during signing ceremony
9. SOUNDBITE (Spanish) Alberto Fernández, President of Argentina:
"Our major issue is poverty and this poverty issue leads to a malnutrition and hunger issues in various levels of society in Argentina."
10. Dongyu handing over a book to Fernández as they talk
11. Close of Fernández and Dongyu shaking hands
12. Fernández holding a red package
13. SOUNDBITE (Spanish) Alberto Fernández, President of Argentina:
"As we are fighting hunger and we are striving to improve food quality, the FAO has a lot to offer and this is what we are trying to do with the Director (Qu Dongyu), put FAO and Argentinian teams to work and make sure that this is implemented in the field."
14. Fernández and Dongyu exchanging gifts and shaking hands
15. Various of Fernández an Dongyu addressing press
STORYLINE:
The President of Argentina Alberto Fernández spoke of the importance of cooperation between his country and the Food and Agriculture Organization of the United Nations (FAO), during a meeting with the organisation's director general in Rome on Saturday.
Fernández said his government and the FAO were working together to combat issues of malnutrition, food security and poverty in Argentina.
His meeting with FAO Director General Qu Dongyu was the final appointment of his visit to Italy, which included talks with Italian President Sergio Mattarella, Italian Prime Minister Giuseppe Conte, and a private meeting with Pope Francis at the Vatican.
Fernández will continue his European tour with visits to Germany, Spain and France.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.