బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Shahrukh Khan News) హీరోగా.. ఆయనకు జోడీగా దీపికా పదుకొణె(Deepika Padukone News) అంటే ఈ సినిమాపై సాధారణంగా అంచనాలుంటాయి. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' లాంటి భారీ విజయం తర్వాత ఈ కలయికలో వస్తున్న చిత్రం కావటం వల్ల 'పఠాన్'పై(Pathan Movie News) ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వాటిని అందుకోవటానికి ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో యష్‌రాజ్ సంస్థ ఖర్చుకు ఎక్కడా వెనకాడటం లేదని తెలుస్తోంది.
అందులో భాగంగానే షారుక్, దీపికలపై వచ్చే పాటను యూరప్‌లోని రిచ్ లొకేషన్స్‌తో పాటు మల్లోర్క ఐల్యాండ్, క్యాడిజ్ సిటీల్లో తెరకెక్కించనున్నారు.
" ఇప్పటివరకూ ఏ బాలీవుడ్ చిత్రంలోనూ కనిపించని అద్భుతమైన, అందమైన ప్రదేశాలను ఈ చిత్రంలో ప్రేక్షకులు చూడనున్నారు. ఈ లొకేషన్స్ సినిమాకు విజువల్‌గా భారీతనాన్ని తీసుకొస్తాయి. షారుక్, దీపిక కనిపించే తీరు కొత్తగా ఉంటుంది. అభిమానులు కచ్చితంగా ఆస్వాదించేలా ఈ పాట ఉంటుంది" అని యశ్‌రాజ్ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.
భారీ యాక్షన్ కథాంశంతో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో(Pathan Movie Release Date) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో పాటు తమిళ దర్శకుడు అట్లీతోనూ(Shahrukh Khan Atlee) ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు షారుక్.
ఇదీ చదవండి: Shahrukh Khan Atlee: 'మనీహైస్ట్' ప్రొఫెసర్ లాంటి పాత్రలో షారుక్!