'పద్మావత్' సినిమాలో మహర్వాల్ రతన్ సింగ్ పాత్రలో అలరించిన షాహిద్ కపూర్.. మరోసారి పీరియాడికల్ సినిమాలో నటించనున్నారని సమాచారం. ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తీయబోయే ఓ చిత్రంలో షాహిద్ టైటిల్ రోల్ షోషించనున్నట్లు తెలుస్తోంది.
అశ్విన్ వర్దే ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తారని, లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
వీళ్లే కాకుండా శివాజీ బయోపిక్ తీయాలని ఇప్పటికే చాలామంది దర్శక నిర్మాతలు, నటులు భావిస్తున్నారు. గతేడాది ఈ విషయమై ప్రకటన కూడా చేశారు ప్రముఖ కథానాయకుడు రితేశ్ దేశ్‌ముఖ్. కానీ అది ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. సల్మాన్‌ఖాన్‌తో అలీ అబ్బాస్ జాఫర్ కూడా ఈ కథ ఆధారంగానే సినిమా తీయాలని అనుకుంటున్నారట.