ETV Bharat / sitara

'పఠాన్​' కోసం షారుక్​​కు భారీ రెమ్యూనరేషన్!​ - షారుక్​ ఖాన్​ దీపికా పదుకొణె

'జీరో' తర్వాత బాలీవుడ్​ కింగ్​ఖాన్​ షారుక్​ ఖాన్​​ నటిస్తున్న కొత్త చిత్రం 'పఠాన్​'. ఈ సినిమాకు గానూ షారుక్​.. రూ.వంద కోట్ల పారితోషకం తీసుకుంటున్నారని సినీ విమర్శకుడు ఉమైర్​ సంధు ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

Shah Rukh Khan's record-breaking remuneration for Pathan
'పఠాన్​' కోసం షారుఖ్​కు భారీ రెమ్యూనరేషన్!​
author img

By

Published : Mar 26, 2021, 7:14 AM IST

Updated : Mar 26, 2021, 7:49 AM IST

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్​‌ ఖాన్‌ చివరిసారిగా కనిపించిన చిత్రం 'జీరో'. 2018 తర్వాత షారుక్​‌ మరో కొత్త చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆయన 'పఠాన్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షారుక్​ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు.

యశ్‌రాజ్‌ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షారుక్​ రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్నారట. ఇప్పుడు షారుక్​ ఖాన్ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన హీరో. ఇదే విషయాన్ని సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలౌతోంది.

ఈ చిత్రంలో కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తుండగా జాన్ అబ్రహం ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇందులో అతిధిపాత్రలో మెరవనున్నారు. సంగీత ద్వయం విశాల్‌ - చంద్రశేఖర్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. గతేడాది నవంబర్‌లోనే సినిమా సెట్స్​పైకి వెళ్లింది. షారుక్​ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానితో ఓ సినిమా, తమిళ దర్శకుడు అట్లీతో మరో చిత్రం చేయనున్నారు.

ఇదీ చూడండి: 'ఆయనతో పనిచేస్తానని కలలోనూ అనుకోలేదు'

Last Updated : Mar 26, 2021, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.