బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు షారుక్ ఖాన్‌కు వరుసకు సోదరి అయిన నూర్జహాన్ మృతి చెందారు. పాకిస్థాన్‌లోని పెషావర్‌కు చెందిన ఆమె.. క్యాన్సర్‌తో మంగళవారం చనిపోయారు. ఈ విషయాన్ని ఆమె భర్త అసిఫ్ బుర్హాన్ చెప్పారు.
పెషావర్‌లోని షావాలీ కతల్లో స్థానిక నగర పరిషత్‌లో ఒకప్పుడు ఆమె సభ్యురాలిగా ఉండేవారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో తప్పుకున్నారు.

నూర్జహాన్.. తన సోదరుడు షారుక్‌ను కలుసుకునేందుకు భారత్‌కు రెండుసార్లు వచ్చారు. షారుక్ కూడా రెండుసార్లు పాకిస్థాన్ వెళ్లారని సమాచారం. వీరి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది.