వెండితెరపై హీరోగా, నిర్మాతగా సత్తా చాటి బాలీవుడ్ బాద్షాగా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ జోరు పెంచాడు. నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంలో ఓ హర్రర్ సిరీస్‌ను నిర్మించనున్నాడు. 'బేతాళ్' పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌కు పాత్రిక్ గ్రాహమ్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఇంతకుముందు రాధికా ఆప్టేతో కలిసి 'గుల్' అనే వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడీ దర్శకుడు.
వినీత్ కుమార్ సింగ్, అహానా కుమ్రా తదితరులు ఇందులో నటించనున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇది షారుఖ్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న మూడో వెబ్‌సిరీస్.
ఇప్పటికే ఈ బ్యానర్లో ఇమ్రాన్ హష్మి నటించిన 'బార్డ్ ఆఫ్ బ్లడ్', బాబీ దేఓల్ ప్రధాన పాత్రలో 'క్లాస్ ఆఫ్ 83' చిత్రాలు రూపొందాయి. త్వరలో ఇవి డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇది చదవండి: లేడీ మైకేల్ జాక్సన్.. కిర్రాక్ కత్రినా