బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్.. నటుడిగా అలరించడమే కాకుండా, వ్యాఖ్యాతగానూ ఎన్నో వేడుకలను రక్తికట్టించారు. అవార్డు వేడుకలకు హోస్ట్‌గా తన చతుర్లతో కొత్త జోష్ నింపుతుంటారు. అయితే తనలో ఈ కళ, హీరో కాకముందు నుంచే ఉందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
షారుక్ 90వ దశకం తొలినాళ్లలో దూరదర్శన్ ఛానెల్‌లో ఓ సంగీత కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పటివరకూ ఆ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అయితే ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల విషయం బయటకొచ్చింది.
-
#ShahrukhKhan as a tv anchor for a singing programs of #Doordarshan. #srk #shahrukh @memorable_90s pic.twitter.com/MMyIK3PERG
— Bollywoodirect (@Bollywoodirect) October 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ShahrukhKhan as a tv anchor for a singing programs of #Doordarshan. #srk #shahrukh @memorable_90s pic.twitter.com/MMyIK3PERG
— Bollywoodirect (@Bollywoodirect) October 3, 2019#ShahrukhKhan as a tv anchor for a singing programs of #Doordarshan. #srk #shahrukh @memorable_90s pic.twitter.com/MMyIK3PERG
— Bollywoodirect (@Bollywoodirect) October 3, 2019
ఈ వీడియోలో షారుక్.. పాడేందుకు వచ్చిన అప్పటి వర్ధమాన గాయకుడు కుమార్ సానును ప్రేక్షకులకు పరిచయం చేస్తూ కనిపించారు. షారుక్‌లో ఆత్మవిశ్వాసం అప్పట్నుంచే కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, అదే ఆయన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.