ETV Bharat / sitara

'అప్పట్లో చేయని పాత్రలు ఇప్పుడు చేస్తున్నా!' - చావు కబురు చల్లగా ఆమని

'చావు కబురు చల్లగా' సినిమా కోసం వైజాగ్​ యాసలో డైలాగ్​లు చెప్పేందుకు చాలా హోమ్​వర్క్​ చేసినట్లు నటి ఆమని అన్నారు. ఈ సినిమాలో ఆమె ప్రధానపాత్రలో నటించగా.. మార్చి 19న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను ఆమె మీడియాతో పంచుకున్నారు.

Senior Actress Amani latest interview
'అప్పట్లో చేయని పాత్రలు ఇప్పుడు చేస్తున్నా!'
author img

By

Published : Mar 14, 2021, 6:40 AM IST

"కథానాయికగా ఉన్నప్పుడు చేయలేకపోయిన పాత్రలన్నీ ఇప్పుడు పోషిస్తున్నా. అందుకే నటిగా ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా" అన్నారు నటి ఆమని. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమిది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. ఈనెల 19న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో ముచ్చటించారు ఆమని. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

"గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నేను చేస్తున్న రెండో చిత్రమిది. కార్తికేయ ఇందులో శవాలను తీసుకెళ్లే వ్యాన్‌ డ్రైవర్‌గా బస్తీ బాలరాజు అనే పాత్రలో కనిపిస్తారు. నేను తన తల్లి పాత్రను పోషించా. ఓ మురికివాడలో నివసించే పేద కుటుంబం మాది. నా నటన, పలికే సంభాషణలు మాస్‌గా ఉంటాయి. నేనెప్పుడూ ఈ తరహా పాత్ర పోషించలేదు. దర్శకుడు కౌశిక్‌ కథ చెప్పిన వెంటనే చేస్తానని చెప్పేశా. ఈ చిత్రంలో తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని దర్శకుడు ఎంతో చక్కగా ఆవిష్కరించారు. నేనిందులో వైజాగ్‌ యాసలో సంభాషణలు పలకడానికి చాలా కష్టపడ్డా. కొన్ని సీన్లలో నా పాత్రకి చాలా పెద్ద సంభాషణలున్నాయి. అందుకే ఒకరోజు ముందుగానే నా డైలాగ్స్‌ స్క్రిప్ట్‌ తీసుకొని.. రాత్రంతా బట్టీపట్టి షూట్‌కి వెళ్లేదాన్ని".

- ఆమని, నటి

* "సినిమాల సంఖ్యని నేనెప్పుడూ పట్టించుకోను. మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నానా? లేదా? అనే చూసుకుంటా. ఎప్పటికైనా ఓ మంచి శక్తిమంతమైన ప్రతినాయిక పాత్రలో నటించాలనుంది. నేను ప్రస్తుతం అఖిల్‌.. 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటించా. ఆది సాయికుమార్‌ 'బ్లాక్‌' అనే సినిమా చేస్తున్నా. అల్లు శిరీష్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నా. తమిళంలో ఒక సినిమాకు సంతకం చేశా".

* "ఆ రోజుల్లో క్యారవాన్లు లేకపోవడం వల్ల అందరం సెట్‌లోనే కలసి మాట్లాడుకునే వాళ్లం. భోజనాలు చేసేవాళ్లం. ఇప్పుడు గ్యాప్‌ వస్తే క్యార్‌వ్యాన్లలోకి వెళ్లిపోతున్నారు".

ఇదీ చూడండి: 'గ్లామర్‌ పాత్రలు చేయడానికైనా సిద్ధమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.