ETV Bharat / sitara

మరింత విషమంగా కైకాల ఆరోగ్య పరిస్థితి - kaikala satyanarayana news

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు(kaikala satyanarayana health condition). ఆయన చికిత్సకు స్పందించట్లేదని అన్నారు.

actor satyanarayana health condition
కైకాల సత్యనారాయణ
author img

By

Published : Nov 20, 2021, 7:34 PM IST

తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ(kaikala satyanarayana health condition) ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ బులిటెన్‌ను అపోలో వైద్యులు విడుదల చేశారు. "సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్‌ అయ్యాయి. చికిత్సకు ఆశించినంత మేర ఆయన స్పందించటం లేదు" అని వైద్యులు పేర్కొన్నారు.

విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సత్యనారాయణ కుటుంసభ్యులకు(kaikala satyanarayana hospital) ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గత నెల 30న కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇంట్లో జారిపడటం వల్ల కుటుంబసభ్యులు అప్పుడు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2019లో విడుదలైన 'ఎన్టీఆర్‌ కథానాయకుడు', 'మహర్షి' చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.

ఇదీ చూడండి: 'పుష్ప' అప్డేట్​.. 'బ్రో', 'క్యాలీఫ్లవర్'​ ట్రైలర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.