ఇంగ్లీష్ పాప్ సింగర్ 26 ఏళ్ల సెలీనా గోమెజ్ తన సహ నటుడైన 68 ఏళ్ల బిల్ ముర్రేను పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవంలో సెలీనా తొలిసారిగా రెడ్‌కార్పెట్‌పై హోయలొలికించారు. ఆమె నటించిన ‘'ది డెడ్ డోన్ట్ డై'’ సినిమాను కేన్స్‌లో ప్రదర్శించారు. ఇందులో సెలీనా, బిల్ ముర్రే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా సెలీనా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కేన్స్ లుక్‌ను పోస్ట్ చేస్తూ ఈ షాకింగ్ వార్త వెల్లడించారు.
" కేన్స్‌లో తొలిసారి పాల్గొన్నా. ‘ది డెడ్ డోన్ట్ డై’ చిత్రంలో నేనూ భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మరో విషయం ఏంటంటే.. నేను నా సహనటుడైన బిల్ ముర్రేను పెళ్లి చేసుకోబోతున్నాను ".
-- సెలీనా గోమెజ్, హాలీవుడ్ నటి, గాయనిసెలీనా ఇన్‌స్టా పోస్టు
తన పెళ్లి గురించి సెలీనా జోక్ చేశారో లేక సీరియస్‌గా అన్నారో తెలీదు కానీ ఈ ప్రకటనతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. తాత వయసున్న వ్యక్తితో పెళ్లేంటంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
బీబర్ కారణమా..?
ఇటీవలే తన మాజీ ప్రియుడైన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ కోపంతో సెలీనా ఇలాంటి నిర్ణయం తీసుకుందేమోనని కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ చిత్రసీమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.