బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.. అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఫౌంహౌస్‌కే పరిమితమన భాయ్.. ఇటీవల కాలంలో పలు పోస్ట్‌లు పెడుతూ అలరిస్తున్నాడు. తాజాగా పంచుకున్న ఓ వీడియోలో తన పెంపుడు గుర్రానికి ఆకుకూరలు పెడుతూ, తాను వాటిని తిన్నాడు. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'పోరాట సమయాల్లో ఆరోగ్యకరమైన అల్పాహారం' అని ఓ నెటిజన్ రాయగా, 'మంచి డిటాక్సినేషన్ ఫుడ్' అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఈరోజు అందమైన వీడియో ఇదేనంటూ కొందరు కామెంట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">