నటి, హీరోయిన్గా దక్షిణాదిలో రాణిస్తున్న సమంత.. చదువులోనూ టాపర్ అని చాలా మందికి తెలియదు. తాజాగా ఈ విషయాన్ని చెబుతూ తన 10, 11వ తరగతులకు సంబంధించిన మార్కుల జాబితాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
10వ తరగతిలో 1000కిగానూ 887 మార్కులు తెచ్చుకుని 43 మంది విద్యార్థులున్న క్లాస్లో తొలిస్థానం తెచ్చుకుంది సామ్. 11వ తరగతిలోనూ సబ్జెక్టుల పరంగా మంచి మార్కులే తెచ్చుకుంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.