ETV Bharat / sitara

అఫ్ఘాన్​లో సత్యదేవ్ అరెస్ట్.. ఎందుకంటే! - సత్యదేవ్​ అరెస్ట్​

'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటుడు సత్యదేవ్​.. తన జీవితంలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. ఓ సినిమా చిత్రీకరణ కోసం అఫ్ఘానిస్థాన్​కు వెళితే.. తనను మానవ బాంబు అనుకుని అక్కడి పోలీసులు అరెస్ట్​ చేశారని తెలిపారు. అధికారులు తనను చుట్టుముట్టి తుపాకులు గురి పెట్టగానే తన జీవితం అక్కడే అయిపోయిందని అనుకున్నట్లు వెల్లడించారు.

Satyadev Alitho Saradaga
అఫ్ఘాన్​లో సత్యదేవ్ అరెస్ట్
author img

By

Published : Oct 16, 2020, 5:08 PM IST

తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు 'జ్యోతిలక్ష్మీ' ఫేం సత్యదేవ్. ఇప్పటివరకు విభిన్న పాత్రల్లో నటించిన ఈయన ఇటీవల 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' చిత్రంతో మంచి బ్రేక్​ ​అందుకున్నారు. ఇటీవలే 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన సత్యదేవ్​.. తన జీవితంలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. ఓ సినిమా చిత్రీకరణ కోసం అఫ్ఘానిస్థాన్​ వెళ్తే.. తనను మానవబాంబు అనుకుని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఓ హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం అఫ్ఘానిస్థాన్ వెళ్లాం. ఆ రోజు సోమవారం. అయితే మాకు షూటింగ్​కు అనుమతి మంగళవారం నుంచి లభించింది. మంగళవారం అన్న సెంటిమెంట్​తో తొలి రోజే చిన్న షూట్​ ప్లాన్​ చేశాం. నేను అటు ఇటు సరదాగా నడిచే సన్నివేశం అది. అయితే ఆ ప్రాంతంలో అప్పటి వరకు తొమ్మిది సార్లు బాంబు దాడులు జరిగాయట. మా చిత్రబృందం కూడా అక్కడ షూటింగ్ జరుగుతుంది అని తెలియని రీతిలో ప్లాన్ చేశారు. ఇక షాట్​లో భాగంగా నేను, మరొక వ్యక్తి అటు ఇటూ తిరుగుతున్నాం. ఇంతలో మా మీద అనుమానంతో పెద్ద ఎత్తున పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. సంకెళ్లు వేసి విచారించడం మొదలుపెట్టారు. నేను కాస్ట్యూమ్​లో ఉండటం వల్ల పాస్ పోర్ట్ రూమ్​లో వదిలేశానని చెప్పా. కానీ నాతో వచ్చిన వ్యక్తి తన పాస్​పోర్ట్ ఉందని చెప్పి సాక్స్​లో చేయి పెట్టబోయాడు. మానవ బాంబ్ పెట్టుకున్న వాళ్లు కూడా ట్రిగ్గర్​ను అక్కడే పెట్టుకుంటారట. దీంతో అప్రమత్తమైన అధికారులు తుపాకులు లోడ్​ చేసి మాకు గురి పెట్టారు. ఇక మా పని అయిపోయింది.. నా జీవితంలో అదే ఆఖరి రోజు అని అనుకున్నా. మమ్మల్ని చంపెయ్యడానికి వాళ్ల దగ్గర కారణాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. మా చిత్రబృందం ఇదంతా గమనించలేదు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య పెద్ద చర్చలు జరిగి మమ్మల్ని వదిలేశారు. అనంతరం 40 రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుపుకొన్నాం. కాకపోతే ఆ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది" అని సత్యదేవ్​ తన థ్రిల్లింగ్​ అనుభవాన్ని పంచుకున్నారు.

ఇదీ చూడండి 'కేజీఎఫ్ 2' షూటింగ్ కోసం సంజయ్ దత్ రెడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.