"ఎప్పుడూ ఒకే తరహా కథలు, పాత్రల్లో నటిస్తుంటే కొన్నాళ్లకు నాకు నేనే బోర్ కొట్టేస్తా. అలా అనిపించకూడదంటే.. కచ్చితంగా భిన్నమైన కథల్నే ఎంచుకోవాలి. ప్రస్తుతం నా లైనప్‌లో ఉన్న కథలన్నీ ఇలాంటివే" అని నటుడు సత్యదేవ్ అన్నారు. వైవిధ్యభరిత కథాంశాలకు చిరునామా ఆయన. ఇప్పుడలాంటి ఓ విభిన్నమైన కథాంశంతోనే 'తిమ్మరుసు'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సత్యదేవ్.
* సాధారణంగా థ్రిల్లర్ కథలనగానే.. యాక్షన్ డ్రామాలు, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ కథాంశాలు, కాప్ థ్రిల్లర్లు వంటివే కనిపిస్తుంటాయి. ఇది వాటన్నింటికి భిన్నమైన థ్రిల్లర్. ఓ లాయర్ కోణంలో సాగే యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందింది.
* తొలి దశ కరోనా తర్వాత తెలుగులో విడుదలైన చిత్రాలన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు చిత్రసీమలో చాలా హిట్లు పడ్డాయి. ఇప్పుడా స్ఫూర్తితో, మమ్మల్నీ ప్రేక్షకులు ప్రోత్సహిస్తారనే నమ్మకంతో.. ఇన్నాళ్లు ఆగి థియేటర్లలోకి వస్తున్నాం. ప్రేక్షకులు మునుపటిలా అన్ని రకాల జాగ్రత్తలతో థియేటర్లకు వస్తారని నమ్మకంతో ఉన్నాం.
* ప్రస్తుతం 'గుర్తుందా శీతాకాలం', 'స్కైలాబ్', 'గాడ్సే' చిత్రాలు చేస్తున్నా. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో 'రామ్‌సేతు' సినిమా చేస్తున్నా. నేను కొరటాల శివ బ్యానర్‌లో చేస్తున్న కొత్త చిత్రం త్వరలోనే మొదలవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: