బాలీవుడ్ యువ హీరో సూరజ్ పంచోలి నటిస్తున్న సినిమా 'శాటిలైట్ శంకర్'. మేఘా ఆకాశ్ హీరోయిన్. గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్మీ గొప్పతనం గురించి చెబుతూ సాగిన ఈ ప్రచార చిత్రం.. అంచనాల్ని పెంచుతోంది.
"సాధారణంగా అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ సంకేతాలను భూమికి పంపుతూ ఉంటుంది. అలాగే ఒక శాటిలైట్ భారత సరిహద్దుల్లో ఉంది. తన స్టైల్‌తో ప్రజల్ని కలుపుతూ ఉంటుంది", "ఒక దేశం ముక్కలయ్యేందుకు లక్ష కారణాలు ఉండవచ్చు. కానీ, ఒక్క సైనికుడు మాత్రమే దాన్ని కలపగలడు" అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
ఆర్మీలో పనిచేస్తున్న శంకర్ అనే యువకుడు సెలవుపై సొంతూరు పొల్లాచ్చికి వస్తాడు. అక్కడ అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడు? ఆర్మీ గొప్పదనాన్ని ఎలా చాటిచెప్పాడన్నది కథ.
ఇందులో సల్మాన్‌ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇర్ఫాన్ కమల్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినీ వన్ స్టూడియోస్ పతాకంపై మురాద్ ఖేతన్, అశ్విన్ వార్దేలు నిర్మిస్తున్నారు. వచ్చే నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">