ETV Bharat / sitara

ఆ చిత్రంలో 'పెళ్లి కాని ప్రసాద్'​గా శర్వానంద్​! - ఆడవాళ్లు మీకు జోహార్లు శర్వానంద్​

కిశోర్​ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో పెళ్లి కాని ప్రసాద్​ అనే కామెడీ పాత్రలో హీరో శర్వానంద్​ నటించనున్నారని తెలిసింది. ఇందులో హీరోయిన్​గా రష్మిక నటించనుంది.

sarvanand
శర్వానంద్​
author img

By

Published : Mar 23, 2021, 10:43 PM IST

'మల్లీశ్వరి' సినిమాలో 'పెళ్లి కాని ప్రసాద్'​ పాత్రలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హీరో వెంకటేశ్​. ఆ చిత్రాన్ని ఇప్పుడు చూసినా, గుర్తుకుతెచ్చుకున్నా వెంకీ చేసిన కామెడీకి నవ్వుకుంటూనే ఉంటాం. అంతగా ఆ పాత్రలో ఆయన సినీప్రియులు చేత గిలిగింతలు పెట్టించారు. ఇప్పుడే అలాంటి తరహా పాత్రలోనే హీరో శర్వానంద్​ నటించనున్నారని తెలిసింది. ఈ విషయమై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం శర్వా.. కిశోర్​ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలోనే ఆయన పూర్తి స్థాయి కామెడీ పాత్రలో పెళ్లి కాని ప్రసాద్​గా​ కనిపించనున్నారని తెలిసింది. ఇక ఆయన పండించే హాస్యమే ఈ చిత్రంలో హైలెట్​గా నిలువనుందట. కాగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించనుంది. ఈ చిత్రంతో పాటు శర్వా.. సిద్ధార్థ్​తో కలిసి 'మహాసముద్రం'లోనూ నటిస్తున్నారు. అజయ్​ భూపతి దర్శకుడు. ఇటీవల ఆయన నటించిన 'శ్రీకారం' విడుదలై ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది.

ఇదీ చూడండి: శర్వానంద్​ నుంచి వరుస సర్​ప్రైజ్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.