సర్దార్ ఉద్దమ్ సింగ్ జీవిత కథతో సుజీత్ సర్కార్ ఓ దేశభక్తి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను రైజింగ్ సన్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. నిన్నమొన్నటి వరకు యూరప్‌లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమా తాజాగా తుది షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిత్రబృందం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేసింది. యూరప్ వీధుల్లో దిగిన ఫొటోనూ షేర్ చేసింది.
కథ ఏంటంటే...
1919.. పంజాబ్‌లో జలియాన్‌వాలా బాగ్ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో నాటి పంజాబ్ గవర్నర్ జనరల్ మైఖల్ ఓ డయ్యర్ శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న భారతీయులపై పోలీసులతో కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో వేలాది మంది భారతీయులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే దీనికి ప్రతీకారంగా నాటి విప్లవ వీరుడు ఉద్దమ్ సింగ్ డయ్యర్‌ను లండన్‌లో మార్చి 13, 1940లో కాల్చి చంపాడు. ఆ వెంటనే బ్రిటీష్ ప్రభుత్వం ఉద్దమ్‌ను అరెస్టు చేసి 1940 జులై 31న ఉరితీసింది. ఇదే కథతో సినిమాను తీర్చిదిద్దనున్నారు. వచ్చే ఏడాది అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
Filming complete... Final schedule of #SardarUdhamSingh was completed in #Europe... Stars #VickyKaushal in title role... Directed by Shoojit Sircar... Produced by Ronnie Lahiri and Sheel Kumar... 2 Oct 2020 release. pic.twitter.com/MiTi6JovYD
— taran adarsh (@taran_adarsh) December 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Filming complete... Final schedule of #SardarUdhamSingh was completed in #Europe... Stars #VickyKaushal in title role... Directed by Shoojit Sircar... Produced by Ronnie Lahiri and Sheel Kumar... 2 Oct 2020 release. pic.twitter.com/MiTi6JovYD
— taran adarsh (@taran_adarsh) December 27, 2019Filming complete... Final schedule of #SardarUdhamSingh was completed in #Europe... Stars #VickyKaushal in title role... Directed by Shoojit Sircar... Produced by Ronnie Lahiri and Sheel Kumar... 2 Oct 2020 release. pic.twitter.com/MiTi6JovYD
— taran adarsh (@taran_adarsh) December 27, 2019