ETV Bharat / sitara

'నెహ్రూ కోసం పటేల్ ప్రధాని పదవిని త్యాగం చేశారు' - కంగనా రనౌత్ వార్తలు

సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ భారతదేశపు నిజమైన 'ఐరన్​ మ్యాన్'​ అని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ట్వీట్​ చేశారు. పటేల్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవను కంగన గుర్తుచేసుకున్నారు.

Sardar Patel sacrificed post of first Prime Minister for weaker mind like Nehru: Kangana
'నెహ్రూ కోసం ప్రటేల్​ ప్రధాని పదవిని త్యాగం చేశారు'
author img

By

Published : Oct 31, 2020, 12:44 PM IST

Updated : Oct 31, 2020, 12:54 PM IST

ఐరన్​మ్యాన్ ఆఫ్​ ఇండియా సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా​ ఆయనకు నివాళులు అర్పించారు బాలీవుడ్​ నటి కంగనా రనౌత్. జవహార్​లాల్​ నెహ్రూ కోసం దేశానికి తొలి ప్రధానమంత్రి పదవిని పటేల్​ త్యాగం చేశారని ఆమె కొనియాడారు.

  • Wishing India’s Iron man #SardarVallabhbhaiPatel a happy anniversary, you are the man who gave us today’s akhand Bharat but you took your great leadership and vision away from us by sacrificing your position as a Prime Minister. We deeply regret your decision 🙏

    — Kangana Ranaut (@KanganaTeam) October 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పటేల్ నిజమైన ఉక్కు మనిషి. మానసికంగా బలహీనులైన నెహ్రూను గాంధీ కావాలనే ఆ పదవికి ఎంచుకున్నారు. ఎందుకంటే నెహ్రూను ముందుంచి గాంధీ తనకు నచ్చినట్టు కథను నడింపించేందుకు ఇలా చేసుండొచ్చని నేను నమ్ముతున్నా. అయితే గాంధీ మరణించిన తర్వాత దేశ పరిస్థితి ఘోరంగా తయారయింది. అఖండ భారతదేశాన్ని ప్రజలకిచ్చి నాయకత్వాన్ని, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు పటేల్. మీ నిర్ణయానికి మేము చింతిస్తున్నాం. తొలి ప్రధానిగా అవ్వాల్సిన పటేల్​.. నెహ్రూ ఇంగ్లీష్ బాగా​ మాట్లాడతారనే కారణంగా గాంధీపై విధేయతతో ఆ పదవిని త్యాగం చేశారు. ఈ చర్యతో వల్లభాయ్​ పటేల్​కు ఎలాంటి నష్టం జరగలేదు. కానీ, కొన్ని దశాబ్దాలుగా మన దేశ ప్రజలు కష్టాలు పడుతున్నారు".

-కంగనా రనౌత్​, బాలీవుడ్​ నటి

రిపబ్లిక్​ ఆఫ్​ ఇండియా నిర్మాణానికి స్వాతంత్య్రం రాకముందు దేశంలోని మొత్తం 562 రాచరిక రాష్ట్రాలను ఏకం చేసిన ఘనత సర్దార్​ పటేల్​కు దక్కుతుంది. పటేల్​ 1950 డిసెంబరు 15న కన్నుమూశారు.

Last Updated : Oct 31, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.