తన తల్లి అమృతా సింగ్‌పై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టింది హీరోయిన్ సారా అలీఖాన్. తల్లి గర్వపడే స్థాయికి ఎదగటమే.. జీవితంలో తనకున్న ఏకైక లక్ష్యమని చెప్పింది. ఓ తల్లిగా ఆమె తన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించిందని కొనియాడింది. ఆమె తన స్ఫూర్తి అని చెప్పిన సారా.. తామిద్దరు మంచి స్నేహితులమని వివరించింది. ప్రతి విషయాన్ని తల్లితో పంచుకుంటానని తెలిపింది.
"నేనెప్పుడూ మా అమ్మతోనే ఉంటాను. నాకు అన్నీ అమ్మే. తనే నా ప్రపంచం. మా అమ్మ గర్వించగల స్థాయికి ఎదగటమే నా జీవిత లక్ష్యం. నాకు, నా తమ్ముడికి ఆమె జీవితానిచ్చింది. ఆమె మాకు చేసిన మేలులో కనీసం పదో వంతైనా ఆమెకు చేయాలనేదే నా ఉద్దేశం. అప్పుడే నా జీవితానికి ఓ అర్థం."
-సారా అలీఖాన్, హీరోయిన్.
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతా సింగ్. వీరికి సారా, ఇబ్రహీం అలీఖాన్ సంతానం. అనంతరం అమృతా సింగ్‌తో విడిపోయిన సైఫ్.. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు.
ప్రస్తుతం సారా 'అత్రాంగీ రే'లో నటిస్తోంది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: స్టార్ కుటుంబమే అయినా.. 'స్టార్డమ్' నమ్మనంటోంది!