ETV Bharat / sitara

Saranga Dariya @250: యూట్యూబ్​ వ్యూస్​లో సరికొత్త​ రికార్డు

'లవ్​స్టోరి'(Love Story) సినిమాలోని 'సారంగ దరియా'(Saranga Dariya) గీతం ఇప్పుడు యూట్యూబ్​లో దుమ్ముదులుపుతోంది. అతి తక్కువ సమయంలోనే 25 కోట్ల వ్యూస్​ దక్కించుకున్న దక్షిణాది పాటగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

author img

By

Published : Jun 22, 2021, 5:47 PM IST

Saranga Daria Lyrical Song Clicks 250 Million Views
saranga dariya @250: యూట్యూబ్​ వ్యూస్​తో సరికొత్త​ రికార్డు

హీరోయిన్​ సాయిపల్లవి(Sai pallavi) 'సారంగ దరియా..' (Saranga Daria) పాట యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. నెట్టింట విడుదలైన నెల రోజుల్లోనే 10 కోట్ల వీక్షణలు దక్కించుకొని రికార్డు సృష్టించిన ఈ గీతం.. అతి తక్కువ కాలంలోనే 20కోట్లకు పైగా వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు ఏకంగా 25 కోట్ల వ్యూస్‌(250 Million views for Saranga Daria)తో ఇంకా జోరు కొనసాగిస్తోంది. సినిమా విడుదలకు ముందే వ్యూస్‌తో రికార్డులు సృష్టించిన అతి తక్కువ సినిమా పాటల్లో 'సారంగ దరియా' ఒకటి కావడం విశేషం.

నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్‌స్టోరి' (Love Story). పవన్‌ సి.హెచ్‌ స్వరాలందించారు. రచయిత సుద్దాల అశోక్‌ తేజ (Suddala Ashok Teja) సాహిత్యంతో కొత్త సొబగులద్దుకున్న ఈ తెలంగాణ జానపదాన్ని.. మంగ్లీ (Mangli) ఆలపించిన తీరు, దానికి హుషారెత్తించేలా సాయి పల్లవి కాలు కదిపిన విధానం పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే ఈ పాటకు యూట్యూబ్‌లో ఇంతటి ఆదరణ దక్కుతోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందింది.

పూర్తిస్థాయిలో థియేటర్లు తెరిచాకే!

తెలుగు రాష్ట్రాల్లో దశల వారీగా కరోనా ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరున, లేదంటే వచ్చే నెల ప్రారంభంలో థియేటర్లు తెరుచుకోనున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. సినిమాహాళ్లు తెరిచిన వెంటనే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన 'లవ్​స్టోరి'(Love Story) విడుదల కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిత్రనిర్మాత సునీల్​ నారంగ్​ ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు.

"థియేటర్లు తెరిచిన తర్వాత రోజుకు మూడు షోలు అనుమతించే క్రమంలో 'లవ్​స్టోరి' సినిమాను విడుదల చేయలేం. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ సడలించిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తాం. నాకు తెలిసి జులై రెండో వారానికి సాధారణ పరిస్థితులు ఉండొచ్చని భావిస్తున్నాను. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్​ చేస్తామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం" అని నిర్మాత సునీల్​ నారంగ్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి.. యూట్యూబ్​లో 'సారంగ దరియా' పాట రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.