ETV Bharat / sitara

'అర్జున్​రెడ్డి' దర్శకుడితో రణ్​బీర్​.. హీరోయిన్​గా సారా! - సారా అలీఖాన్​, రణ్​బీర్​ కపూర్

బాలీవుడ్ హీరో రణ్​బీర్​ కపూర్​, దర్శకుడు సందీప్​రెడ్డి వంగా కాంబినేషన్​లో ఓ యాక్షన్​ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్​గా సారా అలీఖాన్​ను చిత్రబృందం ఎంపిక చేసిందని సమాచారం.

Sara Ali Khan to star opposite Ranbir Kapoor in Sandeep Vanga Reddy's next?
రణ్​బీర్​, సందీప్​ వంగ చిత్రంలో హీరోయిన్​గా సారా!
author img

By

Published : Dec 30, 2020, 7:08 PM IST

బాలీవుడ్​ కథానాయకుడు రణ్​బీర్​ కపూర్ హీరోగా​, సందీప్​రెడ్డి వంగా దర్శకత్వం​లో ఓ చిత్రం రూపొందనుంది. 'కబీర్​సింగ్'​ తర్వాత ఆ దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు పెరిగాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్​గా సారా అలీఖాన్​ను చిత్రబృందం ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హీరోయిన్​గా పలువురిని ఆడిషన్​ చేయగా.. చిత్రబృందం సారావైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. యాక్షన్​ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సినీ వర్గాలు అంటున్నాయి. టీ సిరీస్​ నిర్మించనున్న ఈ సినిమాకు 'ఏనిమల్'​ అనే టైటిల్ పరీశీలనలో ఉంది.

'బ్రహ్మాస్త్ర', 'షంషేరా', 'లవ్​ రంజన్' చిత్రాలతో ప్రస్తుతం రణ్​బీర్​ బీజీగా ఉన్నాడు. సారా.. ఆనంద్​ ఎల్​.రాయ్​ 'అతిరంగీ రే' చిత్రీకరణలో ఉంది. ఈ రెండూ పూర్తవగానే 'ఏనిమల్​' సెట్స్​పైకి వెళ్లనుంది.

ఇదీ చూడండి: నలభై ఏళ్లలోనూ అదరగొట్టేస్తున్న మలైకా, శిల్ప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.