Sankranthi release movies: కరోనా మహమ్మారి ఈసారి సంక్రాంతి సినిమాలపై గట్టి దెబ్బ కొట్టింది. దీంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా పక్కకు వెళ్లిపోయాయి. దీంతో యువ కథానాయకుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టాయి. మరి ఈ సంక్రాంతి సీజన్‌లో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలేంటో చూసేయండి.
మరోసారి సంక్రాంతి సోగ్గాడిగా 'బంగార్రాజు'
నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయన' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే 'బంగార్రాజు'. తండ్రి నాగార్జునతో కలిసి ఇందులో నాగచైతన్య సందడి చేస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. సినిమా విడుదలపై చివరి వరకూ ఉత్కంఠ నెలకొనగా ఎట్టకేలకు జనవరి 14న 'బంగార్రాజును' విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరి తండ్రీకొడుకులు ప్రేక్షకులను ఎలా అలరిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
థియేటర్లలో 'సూపర్ మచ్చి'
చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'సూపర్‌మచ్చి'. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమైంది. రియా చక్రవర్తి, రుచితా రామ్ కథానాయికలుగా నటించారు. రొమాంటిక్ కామెడీ రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా/లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం సంక్రాంతి రేసులో నిలిచింది. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కాలేజీ ప్రేమలు.. విద్యార్థుల గొడవలు
ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా హర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశిదేవ్ విక్రమ్, కార్తిక్ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాలేజీ ప్రేమలు.. ఆ ప్రేమ కోసం విద్యార్థుల మధ్య జరిగే కొట్లాటలు తదితర అంశాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'హీరో'గా మహేశ్‌బాబు మేనల్లుడు
మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న 'హీరో' సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఇవే!
అమెరికాలో ప్రిన్స్ కష్టాలు..
యువ నటుడు ప్రిన్స్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ది అమెరికన్ డ్రీమ్’. డబ్బు సంపాదించటం కోసం అమెరికాలో ఎదురయ్యే కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. విఘ్నేశ్ కౌశిక్ దర్శకత్వం వహించారు. నేహా కథానాయిక. ఈ చిత్రం జనవరి 14 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్
గెహరాయియా (హిందీ) జనవరి 11
ఫూతుమ్ ఫూదు కాలాయ్ విదియాదా (తమిళ్) జనవరి 14
జీ5
గరుడ గమన వృషభ వాహన (కన్నడ) జనవరి 13
డిస్నీ+హాట్‌స్టార్
ఎటెర్నల్స్ (తెలుగు డబ్బింగ్) జనవరి 12
హ్యూమన్ (హిందీ) జనవరి 14
నెట్‌ఫ్లిక్స్
అండర్ కవర్ (వెబ్ సిరీస్) జనవరి 10
బ్రేజన్ (హాలీవుడ్) జనవరి 13
ఆర్కైవ్ 81 (వెబ్ సిరీస్) జనవరి 14
యే కాలీ కాలీ ఆంఖే (హిందీ) జనవరి 14
ఇదీ చూడండి: సాక్షి ద్వివేది.. కుర్రోళ్లను ఇట్టే టెంప్ట్ చేస్తోందిగా!