ETV Bharat / sitara

సంక్రాంతికి సినిమాలే సినిమాలు.. కాకపోతే 'చిన్న' ట్విస్ట్ - DJ tillu movie

Sankranthi movies release: మీరు సినిమా ప్రేమికులా? అయితే ఈసారి సంక్రాంతి వరుసపెట్టి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. కాకపోతే వచ్చే వాటిలో ఎక్కువశాతం చిన్న చిత్రాలే ఉన్నాయి. వాటి గురించే ఈ స్పెషల్ స్టోరీ.

sankranthi 2022 telugu movies
సంక్రాంతికి సినిమాలు
author img

By

Published : Jan 2, 2022, 1:55 PM IST

RRR postponed: గతేడాది సంక్రాంతికి వచ్చిన తెలుగు సినిమాలేవో గుర్తున్నాయా? కచ్చితంగా మీకు గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే కరోనా, మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఏ రోజు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. ఎందుకంటే మొన్నమొన్నటి వరకు సంక్రాంతికి కచ్చితంగా వస్తుందనుకున్న 'ఆర్ఆర్ఆర్'.. మళ్లీ వాయిదా పడింది.

radhe shyam movie RRR movie
రాధేశ్యామ్-ఆర్ఆర్ఆర్

Radhe shyam movie: మరోవైపు ప్రభాస్ 'రాధేశ్యామ్' పక్కా వస్తుందని చిత్రబృందం ధీమాగా ఉన్నప్పటికీ.. బయట పరిస్థితులు రోజురోజుకు జటిలంగా మారుతున్నాయి. పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత, కొన్ని రాష్ట్రాల్లోని థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి.. ఇలా పలు కారణాలు సినిమా విడుదలపై అభిమానులకు సందేహాలు కలిగిస్తున్నాయి.

అయితే ఈసారి సంక్రాంతికి సినిమాలే రావా? ఏం చూడలేమా? అని అనుకుంటున్న తెలుగు సినీ ప్రేక్షకుడిని అలరించేందుకు వరుసపెట్టి చిన్నాపెద్దా చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఇవి 7-8 వరకు ఉన్నాయి. ఇంతకీ వీటి సంగతేంటి? ఆ సినిమాలేంటి?

'బంగార్రాజు' ధీమా

Bangarraju movie: ఈ సంక్రాంతికి 'బంగార్రాజు' వస్తుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చినప్పుడు.. 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్' సినిమాలను తట్టుకుని అది నిలబడగలదా అని అందరూ అనుకున్నారు. కానీ వివిధ కారణాలతో 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్' వాయిదా పడ్డాయి. దీంతో 'బంగార్రాజు'కు లైన్ క్లియర్ అయింది.

bangarraju movie
బంగార్రాజు మూవీ

'సోగ్గాడే చిన్ని నాయన'కు ప్రీక్వెల్​గా వస్తున్న ఈ సినిమా కూడా మల్టీస్టారరే​ కావడం విశేషం. ఇందులో నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగచైతన్య హీరోగా నటించారు. తొలి భాగంలో ఉన్న రమ్యకృష్ణకు తోడు ముద్దుగుమ్మ కృతిశెట్టి ఇందులో హీరోయిన్​గా చేసింది. సంక్రాంతికి రిలీజ్ అని చెప్పినప్పటికీ సరైన తేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు.

చిన్న చిత్రాల సందడే సందడి

సంక్రాంతి రేసు నుంచి భారీ బడ్జెట్​ సినిమాలు తప్పుకొనేసరికి షూటింగ్​లు పూర్తి చేసుకున్న పలు చిన్న చిత్రాలు.. వెంట వెంటనే రిలీజ్​​ డేట్​లు ప్రకటించాయి. వీటిలో 'డీజే టిల్లు'(జనవరి 14), 'హీరో'(జనవరి 15), 'సూపర్​మచ్చి'(జనవరి 14) విడుదల తేదీలను ఖరారు చేయగా.. 'రౌడీబాయ్స్', '7 డేస్ 6 నైట్స్' చిత్రాలు.. సంక్రాంతి రిలీజ్​ అని పోస్టర్లు రిలీజ్ చేశాయి. వీటితో పాటు తమిళ సినిమా 'వాలిమై' కూడా ఈ పండగకే థియేటర్లలోకి రానుంది.

ప్రస్తుతానికి ఇవి ఖరారైనప్పటికీ, ఇంకేమైనా కొత్త సినిమాలు రేసులోకి వస్తాయా? లేదా ఉన్నవాటి నుంచే ఏ చిత్రాలైనా తప్పుకొంటాయా? అనేది చూడాలి.

DJ tillu movie
డీజే టిల్లు మూవీ
hero movie
హీరో మూవీ
super machi movie
కల్యాణ్​దేవ్ 'సూపర్​మచ్చి' మూవీ
ajith valimai movie
అజిత్ వాలిమై మూవీ
rowdy boys movie
రౌడీబాయ్స్ మూవీ
7 days 6 nights movie
7 డేస్ 6 నైట్స్ మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.