ETV Bharat / sitara

త్వరలోనే మళ్లీ షూటింగ్​లకు సంజయ్ దత్! - అక్షయ్ ​కుమార్ న్యూస్

సంజయ్​ దత్​ త్వరలోనే షూటింగ్​లో పాల్గొనబోతున్నాడా? అనే ప్రశ్నకు అవుననే అంటున్నాయి బాలీవుడ్​ వర్గాలు. ఇటీవలే అనారోగ్యం కారణంగా చిత్రీకరణలకు తాత్కాలిక విరామం ప్రకటించిన సంజూ.. తాను నటించాల్సిన చిత్రాలను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.

Sanjay Dutt To Resume Shoot of Prithviraj Starring Akshay Kumar
'పృథ్వీరాజ్​' చిత్రీకరణలో పాల్గొనబోతున్న సంజు!
author img

By

Published : Sep 20, 2020, 8:12 AM IST

Updated : Sep 20, 2020, 9:13 AM IST

ఆరోగ్యం అసలు సహకరించకున్నా.. సంజయ్​ దత్​ షూటింగ్​లో పాల్గొనబోతున్నాడని బాలీవుడ్​ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్​తో చారిత్రక నేపథ్యంలో యశ్​రాజ్​ ఫిలిమ్స్​ తెరకెక్కిస్తున్న 'పృథ్వీరాజ్​' చిత్రంలో సంజయ్​ దత్​ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్​ కుమార్​, ప్రపంచ మాజీ సుందరి మానుషీ చిల్లర్​ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

"ఈ చిత్రంలో సంజయ్​ దత్​ పాత్రకు సంబంధించిన షూటింగ్​ ఇప్పటికే 85 శాతం పూర్తైంది. మిగిలిన భాగాన్ని చిత్రీకరించాలంటే ఆరు రోజులు సమయం చాలు. అందుకే దీపావళికి ముందు వారంలోనే సంజూ ఈ పెండింగ్​ షూటింగ్​ పూర్తి చేస్తారు" అని చిత్రబృందం చెబుతోంది.

ప్రస్తుతం 'షంషేర్​', 'భుజ్​: ది ప్రైడ్​ ఆఫ్​ ఇండియా', 'కేజీఎఫ్​: చాప్టర్​2', 'పృథ్వీరాజ్​' చిత్రాల్లో నటిస్తున్నాడు సంజయ్​ దత్. అతడు నటించిన 'సడక్​ 2' గతనెల ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సంజూ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

Last Updated : Sep 20, 2020, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.