ETV Bharat / sitara

నా కోసం యాక్షన్​ సీన్స్ మార్చొద్దు: సంజయ్​

author img

By

Published : Dec 30, 2020, 10:50 PM IST

'కేజీఎఫ్​ 2' క్లైమాక్స్​ యాక్షన్​ సీన్స్​లో మార్పు చేయోద్దని చిత్రబృందానికి నటుడు సంజయ్ దత్ విజ్ఞప్తి చేశారట. తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేకర్స్​ కొన్ని స్టంట్లను మార్చినట్లు తెలుసుకున్న సంజూ.. గతంలో అనుకున్నట్లుగానే చిత్రీకరించాలని సూచించారట.

Sanjay Dutt Performs His Own Action Scenes in 'KGF 2', Asks Team To Not Simplify Stunts
'నా కోసం యాక్షన్​ సన్నివేశాల్లో మార్పు చేయోద్దు'

సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కేజీఎఫ్ 2'. భారీ వసూళ్లను రాబట్టి.. కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచిన యాక్షన్, పవర్‌ఫుల్ డ్రామా 'కేజీఎఫ్‌'కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో రానున్న ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణలో ఇటీవల బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అడుగుపెట్టారు. ఆయన ఈ చిత్రంలో ప్రతినాయకుడు అధీరా పాత్రలో నటిస్తున్నారు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్న సంజూ.. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కొన్ని స్టంట్లకు సంబంధించిన సన్నివేశాలను మార్చారు. అయితే దానికి సంజయ్‌ నిరాకరించారని సమాచారం.

స్టంట్ల మార్పు గురించి సంజయ్‌ దత్‌ స్పందిస్తూ.. "యాక్షన్‌ సన్నివేశాలను చేయలేనని భావించి నన్ను అవమానించకండి. ఇంతకుముందుగా అనుకున్నట్లే ఫైట్స్‌ను పూర్తి చేద్దాం. నా కోసం ఎలాంటి మార్పులు చేయకండి. పని విషయంలో ఎలాంటి రాజీపడేది లేదు" అని సంజూ చెప్పారట.

కథానాయకుడు యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న 'కేజీఎఫ్​ 2' టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. త్వరలో సినిమా విడుదల తేదీని వెల్లడించనున్నారు.

ఇదీ చూడండి: 22ఏళ్ల తర్వాత మళ్లీ కుదిరిన ఆ కాంబినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.