బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. తన భార్య మాన్యతకు ఖరీదైన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ముంబయి బాంద్రాలో నాలుగు అపార్ట్‌మెంట్స్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారు. వీటి విలువ దాదాపు రూ.100 కోట్లకు పైనే ఉంటుందట. అయితే వారం తర్వాత మాన్యత వాటిని తిరిగి సంజయ్‌కు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే బాలీవుడ్ చర్చనీయాంశమైంది.
సంజయ్ ప్రస్తుతం 'కేజీఎఫ్ 2', 'భుజ్', 'పృథ్వీరాజ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో ఆ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సంజయ్, మాన్యతలకు 2008 ఫిబ్రవరి 7న వివాహమైంది. అనంతరం కొన్నాళ్లకు ఆమె కవలలకు జన్మనిచ్చింది. అబ్బాయి షహ్రాన్, అమ్మాయి ఇక్ర.
ఇవీ చదవండి: