ETV Bharat / sitara

జైలులో దోమలు కుడుతున్నాయంటూ సంజన కంప్లైంట్

డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంజనను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు మనోహర్, రేష్మ గల్రాని గురువారం పర్ వెళ్లారు. దుస్తులను మాత్రమే తీసుకున్న కారాగార సిబ్బంది ఆహారం, పండ్లరసం, చాక్లెట్లను వెనక్కి ఇచ్చేశారు.

Sanjana Galrani parents went to Jail to see  her
జైలులో దోమలు కుడుతున్నాయంటూ సంజన కంప్లైంట్
author img

By

Published : Sep 18, 2020, 9:55 AM IST

పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్న సంజనకు ఆహారం, దుస్తులు అందించేందుకు ఆమె తల్లిదండ్రులు మనోహర్‌, రేష్మా గల్రాని గురువారం వెళ్లారు. దుస్తులను మాత్రమే తీసుకున్న కారాగార సిబ్బంది, ఆహారం, పండ్ల రసం, చాక్లెట్లను వారికి వెనక్కి ఇచ్చేశారు. మరో నటి రాగిణి నాలుగు రోజులుగా కారాగారంలో ఉంటోంది. తమ బ్యారక్‌ల వెలుపల తిరిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆమె తన గది విడిచి బయటకు రావడం లేదు.

సంజన వచ్చిన తరువాత ఆమెను కూడా రాగిణితో కలిపి ఉంచారు. ఇద్దరూ తమతో తెచ్చుకున్న పుస్తకాలను చదువుతూ కొంత సమయం గడిపారు. వీరిద్దరికీ కారాగారంలో సాధారణ ఖైదీలకు మాదిరి ఆహారాన్నే ఇచ్చారు. నేడు (శుక్రవారం) సంజనను వీడియో కాన్ఫరెన్సు ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. కారాగార నిబంధనలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు, న్యాయవాదితో మాట్లాడుకునేందుకు వీరిద్దరికీ అధికారులు అవకాశం కల్పించారు. ఇద్దరూ కొంత సమయం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దోమలు కుడుతున్నాయంటూ సంజన కారాగారం అధికారులకు ఫిర్యాదు చేశారు. నిద్ర రావడం లేదని, ఇబ్బంది అవుతోందంటూ వాదించారు.

ప్రారంభంలో సంజన పేరు లేదు

డ్రగ్స్‌ కేసులో నటి సంజన గల్రాని పేరు మొదట్లో ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదు. మూడు రోజుల విచారణ తరువాత ఏ14గా పేరు నమోదు చేశారు. అరెస్టుకు ముందు ఆమె నివాసంలో చేసిన సోదాల్లో ఎలాంటి మాదక ద్రవ్యాలు పోలీసులకు లభించలేదు. సంజనకు సంబంధించిన అయిదు ఫోన్లను స్వాధీనపరచుకోగా, అందులో మూడింట్లో సిమ్‌లు లేనట్లు గుర్తించారు. వీటితో పాటు ప్రోమాక్స్‌ కంప్యూటర్‌, డీవీఆర్‌ తదితరాలను స్వాధీనపరచుకున్నారు.

ఈ కేసులో అరెస్టయిన ఏ4 ప్రకాశ్‌ రాంకా అందించిన వివరాల ఆధారంగా సంజన విచారణను కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశ్‌ రాంకా, రాహుల్‌తో కలిసి ఆమె బెంగళూరు, గోవా, కేరళ, శ్రీలంకల్లోని బార్లు, పబ్‌లు, అపార్ట్‌మెంట్లలో నిర్వహించిన పలు పార్టీల్లో సంజన పాల్గొంది. ఆమె మాదక ద్రవ్యాలను విక్రయించినట్లు, వినియోగించినట్లు ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదు. ఆమె మూడు చరవాణులకు సంబంధించిన సిమ్‌ కార్డులు లభిస్తే మరో అడుగు ముందుకు వేసేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మాదక ద్రవ్యాలను విక్రయించేదని ప్రశాంత్‌ రాంకా ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణను కొనసాగించే అవకాశం ఉంది.

స్టార్‌ నటులూ ఉన్నారు

ఇప్పటికే అరెస్టయిన నిందితుల విచారణ సమయంలో శాండిల్​వుక్​కు చెందిన ఇద్దరు స్టార్‌ నటులకు దీంతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నటుల తండ్రి కూడా సినిమా రంగంలో చక్కని నటునిగా గుర్తింపు దక్కించుకున్నారు. పూర్తి ఆధారాలు చేతికి చిక్కిన తరువాతే వీరిని విచారణకు పిలిచే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.