ETV Bharat / sitara

మాదకద్రవ్యాల​​ కేసులో నటి సంజనా గల్రానీ అరెస్టు..

author img

By

Published : Sep 8, 2020, 12:08 PM IST

Updated : Sep 8, 2020, 3:11 PM IST

శాండిల్​వుడ్​లో కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల​​ కేసులో ప్రముఖ నటి సంజనా గల్రానీ అరెస్టయ్యారు. బెంగళూరులోని సీసీబీ కార్యాలయానికి ఆమెను తరలించారు అధికారులు.

Sandalwood drug case : Actress Sanjana detained by CCB office in Bengaluru
మాదకద్రవ్యాల​​ కేసులో నటి సంజనా గల్రానీ అరెస్టు..

డ్రగ్స్‌ వ్యవహారం శాండిల్‌వుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసు దర్యాప్తును కేంద్ర నేర నియంత్రణ విభాగం (సీసీబీ) ముమ్మరం చేసింది. ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు మరికొందరిని అరెస్టు సీసీబీ అధికారులు.. తాజాగా మరో నటి సంజనా గల్రానీని అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం 6.30గంటల సమయంలో బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఆమె నివాసానికి వచ్చిన పోలీసులు దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు చేశారు. అనంతరం ఆమెను ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరు పరిచి పోలీస్‌ కస్టడీకి అడుగుతామని అధికారులు తెలిపారు.

అలాగే, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వీరెన్‌ ఖన్నా అనే వ్యాపారవేత్త ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బెంగళూరులో పెద్ద పెద్ద పార్టీలు నిర్వహిస్తుంటారు. మంగళవారం వీరిద్దరి ఇళ్లల్లో సోదాలు కోసం కోర్టునుంచి అధికారులు సెర్చ్‌ వారెంట్లు తీసుకొని రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో సంజనా సన్నిహితుడైన రాహుల్‌ థోన్సే కూడా కొద్దిరోజుల క్రితమే అరెస్టయిన విషయం తెలిసిందే. అతడితో పాటు మరికొందరు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సంజన నివాసంలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు.

సంజన తెలుగులో బుజ్జిగాడు, సత్యమేవ జయతే, ముగ్గురు, సర్దార్ గబ్బర్ సింగ్, లవ్ యూ బంగారం, అవును 2 వంటి పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్​లోనే కాక కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లోనూ మెరిసింది.

డ్రగ్స్‌ కేసులో ఈ నెల 4న సినీనటి రాగిణి ద్వివేదిని సీసీబీ అధికారులు అరెస్టు చేశారు. అదే రోజు ఉదయం ఆమె నివాసంలో సోదాలు జరిపిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచగా.. మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చింది. అయితే, ఆమె పోలీసుల విచారణకు సహకరించకపోవడం వల్ల మరో ఐదు రోజుల పాటు కస్టడీని సోమవారం పొడిగించారు.

Last Updated : Sep 8, 2020, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.