తనదైన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించే బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు మరోసారి దాతృత్వం చాటుకున్నాడు. ఉత్తర కర్ణాటకలో వరదల ధాటికి కకావికలమైన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశాడు.
తను హీరోగా నటించిన 'కొబ్బరిమట్ట' చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రస్తుతం మంచి వసూళ్లు సాధిస్తుండటంపై ఆనందంగా ఉన్న సంపూ... హైదరాబాద్లో చిత్ర బృందంతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత సాయిరాజేశ్తో కలిసి వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నట్లు చెప్పాడు.
ఇది చదవండి: ప్రఖ్యాత అత్తివరదరాజస్వామి సేవలో రజనీకాంత్