పదిహేనేళ్ల క్రితం 'నరసింహుడు' చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకి పరిచయమైన సమీరా రెడ్డి... దక్షిణాదిన అన్ని భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు 30కి పైగా సినిమాలు చేసిన ఈ అమ్మడు... 2014లో అక్షయ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సినిమాలకి దూరమైంది. కాని ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం పంచుకొంటూ యాక్టివ్గానే ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఈత, వ్యాయామం వంటి పనులు చేసి అభిమానులు అవాక్కయ్యేలా చేసింది. తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ పాపకు 'నైరా' అనే పేరు పెట్టింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' చిత్రంలో నటించిన ఈ అమ్మడు.. ఆయన మీద అభిమానంతో 'సైరా' అని ధ్వనించేలా తన కూతురుకు నామకరణం చేసిందని నెటిజన్లు చమత్కరిస్తున్నారు.