ETV Bharat / sitara

సమంత 'ఊ అంటావా..' ఫుల్​ వీడియో సాంగ్ వచ్చేసింది - పుష్ప

Oo antava video song: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా నుంచి 'ఊ అంటావా.. ఊఊ అంటావా' ఫుల్​ వీడియో సాంగ్ రిలీజైంది. సమంత స్టెప్పులకు ఫ్యాన్స్​ ఫిదా అవుతున్నారు. వీడియో సాంగ్ విడుదలైన గంటల్లోనే లక్షలకొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

samantha
pushpa
author img

By

Published : Jan 7, 2022, 8:55 PM IST

Oo antava video song: 2021లో విడుదలై సెన్సేషన్‌గా మారిన 'ఊ అంటావా.. ఊఊ అంటావా' గీతం ఫుల్‌ వీడియో వచ్చేసింది. సమంత నర్తించటం వల్ల ఈ పాట లిరికల్‌ వీడియోనే యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. విడుదలైన క్షణం నుంచే లక్షల వ్యూస్‌ సొంతం చేసుకుని, ఫుల్‌ వీడియో ఎప్పుడొస్తుందా? అని అందరూ ఎదురుచూసేలా చేసింది. ఆ క్షణం రానే వచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా 'పుష్ప' చిత్ర బృందం ఈ ప్రత్యేక గీతం ఫుల్‌ వీడియోను విడుదల చేసింది. అల్లు అర్జున్‌- సమంత స్టెప్పులు, వారి హావభావాలు అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. అల్లు అర్జున్‌ వైవిధ్యభరిత మ్యానరిజం మెప్పిస్తోంది. సమంత స్టార్‌ నాయికగా రాణిస్తూనే ఈ ఐటెమ్‌లో నర్తించటం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అలా అందరి అంచనాల్ని అందుకుని ఆమె తానేంటో నిరూపించింది.

సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే 'పుష్ప'. రష్మిక కథానాయిక. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబరులో విడుదలైన ఈ సినిమా అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం ఓటీటీ 'అమెజాన్‌ ప్రైమ్‌'లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: చిట్టి పొట్టి బట్టలతో ప్రాక్టీస్​.. 'ఊ అంటావా మామా..' మేకింగ్​ వీడియో వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.