ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం 'శాకుంతలం'. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత ప్రధానపాత్ర పోషిస్తుంది. తాజాగా దుష్యంత్ పాత్రను ఎవరు పోషించబోతున్నారో తెలిపారు సామ్. మలయాళ నటుడు దేవ్ మోహన్.. ఈ పాత్రలో నటించబోతున్నట్లు ఓ వీడియోను ట్వీట్ చేశారు.
-
Here’s introducing our Prince Charming ... DUSHYANT 🤴🏽 @ActorDevMohanhttps://t.co/cqFNzAUsiI #Shaakuntalam @gunasekhar1 @neelima_guna @gunaateamworks
— Samantha Akkineni (@Samanthaprabhu2) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here’s introducing our Prince Charming ... DUSHYANT 🤴🏽 @ActorDevMohanhttps://t.co/cqFNzAUsiI #Shaakuntalam @gunasekhar1 @neelima_guna @gunaateamworks
— Samantha Akkineni (@Samanthaprabhu2) March 6, 2021Here’s introducing our Prince Charming ... DUSHYANT 🤴🏽 @ActorDevMohanhttps://t.co/cqFNzAUsiI #Shaakuntalam @gunasekhar1 @neelima_guna @gunaateamworks
— Samantha Akkineni (@Samanthaprabhu2) March 6, 2021
ఈ సినిమా షూటింగ్‌ను మార్చి 20న ప్రారంభించే ఆలోచనలో చిత్రబృందం ఉందటా!. అందుకు అనుగుణంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్లు ఆ మధ్య విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లో వెల్లడించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: సెట్స్ పైకి వెళ్లనున్న సమంత 'శాకుంతలం'
ఇదీ చూడండి: సమంత 'శాకుంతలం' సెట్స్ చూస్తారా?