ETV Bharat / sitara

'నీ కెరీర్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి' - సమంత నాగచైతన్య

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు నాగ చైతన్య. శనివారంతో చైతూ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అతడి భార్య, హీరోయిన్ సమంత అభినందనలు తెలిపింది.

'నీ కెరీర్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి'
'నీ కెరీర్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి'
author img

By

Published : Sep 5, 2020, 9:50 PM IST

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగచైతన్య. చైతూ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అతడి సతీమణి, నటి సమంత అభినందనలు తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా చైతన్య ఆర్ట్‌ ఫొటోను పంచుకుంటూ "నీ నుంచి వచ్చే సినిమాల కోసం ఉత్సాహంతో ఎదురు చుస్తున్నా. నీ కెరీర్‌ మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆశిస్తున్నా. మై హీరో" అంటూ రాసుకొచ్చింది.

2009లో విడుదలైన 'జోష్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు నాగచైతన్య. ఆ తర్వాత సమంతతో కలిసి చై నటించిన 'ఏమాయ చేశావె' బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వెండితెరపై ప్రేమికులుగా అలరించిన చై-సామ్‌లు నిజ జీవితంలో ఒక్కటయ్యారు. చైతన్య ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌ స్టోరీ'లో నటిస్తున్నాడు. సాయి పల్లవి కథానాయిక. ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 'థ్యాంక్‌ యూ' అనే మరొక చిత్రాన్ని ప్రకటించారు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.