బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్.. తన 54వ పుట్టినరోజున మామయ్యాడు. సోదరి అర్పితా ఖాన్ శుక్రవారం.. తన రెండో కాన్పులో అమ్మాయిని ప్రసవించింది. ఈ విషయాన్ని ఆమె భర్త ఆయుష్ శర్మ ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఈ జంటకు ఇప్పటికే ఆహిల్ అనే మూడేళ్ల పిల్లాడు ఉన్నాడు.
"మాకు అమ్మాయి పుట్టింది. అండగా నిలిచిన మా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు అందరికి ధన్యవాదాలు" -ఆయుష్ శర్మ
సల్మాన్‌ఖాన్ 'దబంగ్ 3'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని అలరిస్తోంది. ప్రస్తుతం 'రాధే' సినిమాలో నటిస్తున్నాడీ హీరో. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఈద్‌కు థియేటర్లలోకి రానుంది.
ఇది చదవండి: స్టార్ బర్త్‌డే స్పెషల్: హమారా భాయ్‌జాన్.. సల్మాన్‌ఖాన్