ETV Bharat / sitara

పరువునష్టం దావాపై సల్మాన్​ టీమ్​ క్లారిటీ - సల్మాన్​ కేఆర్​కే

'రాధే' సినిమా రివ్యూ ఇవ్వడం వల్ల సల్మాన్ తనపై​ పరువునష్టం దావా వేశారని ఆరోపించారు కమాల్​ ఆర్​. ఖాన్​. ఇదే విషయంపై సల్మాన్​ ఖాన్​ లీగల్​ టీమ్​ స్పందించింది. ఈ కేసు నమోదు చేయడానికి అసలైన కారణం అది కాదని ఓ ప్రకటన విడుదల చేసింది. కమాల్​ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొంది.

Salman Khan's legal team clarifies actor sued KRK not due to 'Radhe' review
పరువునష్టం దావాపై సల్మాన్​ టీమ్​ క్లారిటీ
author img

By

Published : May 28, 2021, 4:42 PM IST

సల్మాన్​ నటించిన 'రాధే' చిత్రం రివ్యూ ఇచ్చిన కమాల్​ ఆర్​.ఖాన్​ అనే వ్యక్తిపై ముంబయి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలైంది. ఇదే విషయంపై సల్మాన్​ ఖాన్​ లీగల్​ టీమ్​ స్పష్టత ఇచ్చింది. కమాల్​ ఆర్​.ఖాన్​పై రివ్యూ ఇచ్చినందున పరువు నష్టం దావా వేయాలేదని.. దాని వెనుక కారణం వేరే ఉందని తెలిపింది. కానీ, సదరు వ్యక్తి ఆ కారణాన్ని చెప్పకుండా దాటవేస్తున్నాడని ఆరోపించింది.

"సల్మాన్ ఖాన్​ తనపై పరువునష్టం దావా వేశారని ఆరోపిస్తూ కమాల్​ ఆర్​.ఖాన్​ అనే వ్యక్తి వరుస ట్వీట్లు చేశారు. 'రాధే' చిత్రానికి రివ్యూ ఇచ్చిన కారణంగా తనపై ఈ కేసును నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కానీ, అది నిజం కాదు. సల్మాన్​ ఖాన్​ అవినీతి పరుడని, ఆయన బ్రాండ్​ 'బీయింగ్​ హ్యూమన్​' ఒక మోసమని.. ఆ సంస్థ ద్వారా మనీలాండరింగ్​ లావాదేవీలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విధంగా సల్మాన్​ ఖాన్​పై అసత్యాలను ప్రచారం చేయడం వల్ల అతడిపై పరువు నష్టం దావా వేయాల్సివచ్చింది".

- సల్మాన్​ఖాన్​ లీగల్​ టీమ్

అసలేం జరిగిందంటే?

'రాధే' చిత్రానికి రివ్యూ ఇచ్చిన కమాల్​ ఆర్.ఖాన్​ అనే వ్యక్తిపై హీరో సల్మాన్​ ఖాన్​ లీగల్​ టీమ్​ కోర్టును ఆశ్రయించింది. ముంబయి సిటీ కోర్టులో పరువు నష్టం దావా కేసు నమోదు చేసి సదరు వ్యక్తికి నోటీసులు పంపింది. ఇదే విషయాన్ని కమాల్ ఆర్​.ఖాన్​ తన ట్విట్టర్​లో వెల్లడించారు. 'రాధే' సినిమా రివ్యూ వ్యవహారమై ఇదంతా చేశారని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ నిర్మించాయి. దిశా పటానీ, రణ్​దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. మే 13 ఈ సినిమా జీఫ్లెక్స్ వేదికగా పే పర్ వ్యూ పద్దతిలో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం.

ఇదీ చూడండి: 'రాధే' చిత్ర సమీక్షకునికి సల్మాన్​ లీగల్​ నోటీసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.