ETV Bharat / sitara

సల్మాన్​​ కొత్త సినిమా టైటిల్​ ఇదే! - కభీ ఈద్​ కభీ దివాలీ టైటిల్​ మార్పు

బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్​ఖాన్​, నిర్మాత సాజిద్​ నడియాడ్​వాలా కాంబోలో రూపొందుతోన్న కొత్త చిత్రం 'కభీ ఈద్​ కభీ దివాలీ'. అయితే ఇటీవలే ఈ టైటిల్​ను మార్పు చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఆ టైటిల్​కు బదులుగా 'భాయీజాన్​' పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Salman Khan's Kabhi Eid Kabhi Diwali renamed as Bhaijaan?
సల్మాన్​​ కొత్త సినిమా టైటిల్​ ఇదే!
author img

By

Published : May 7, 2021, 10:44 AM IST

సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా 'కభీ ఈద్​ కభీ దివాలీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పేరును మార్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం సాజిద్‌ ఓ కొత్త పేరును రిజిస్టర్‌ చేయించారు. ఆ టైటిల్​ 'భాయీజాన్‌'. అది సల్మాన్‌ చిత్రం కోసమే అని తెలుస్తోంది. యాక్షన్, కామెడీతో సాగే ఈ చిత్రానికి, ఇలాంటి ఓ కథకు ఈ టైటిల్‌ అయితేనే సరిపోతుందని చిత్రబృందం భావిస్తోందట. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఆయుష్‌ శర్మ, జహీర్‌ ఇక్బాల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ఐశ్వర్య సోయగం.. చూసితీరాలి కచ్చితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.