బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' ఈద్ కానుకగా మే 13న విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించగా జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రానికి లీక్ల బెడద తప్పలేదు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో స్ట్రీమింగ్ అయింది.
దీంతో ఈ విషయమై ఆగ్రహించిన సల్మాన్.. ఈ చర్యలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. సైబర్ పోలీసులు ఈ చట్ట విరుద్ధమైన పైరేటెడ్ సైట్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారని తెలిపాడు.
"ఓ చిత్రాన్ని పైరసీ ద్వారా వీక్షించడం పెద్ద నేరం. మేము 'రాధే' చిత్రాన్ని సమంజసమైన ధర రూ.249కే అందించాం. పైరేటెడ్ సైట్లు చట్టవిరుద్ధంగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నాయి. దయచేసి ఎవరూ వీటిని ప్రోత్సాహించవద్దు. ఇబ్బందుల్లో పడతారు. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను." అని సల్మాన్ అన్నాడు.
ఇదీ చూడండి: సల్మాన్ 'రాధే' చిత్రంపై మీమ్స్ చూశారా!