కరోనా విరామ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. వ్యవసాయం చేస్తూ.. ట్రాక్టర్ నడుపుతున్న వీడియోను సోమవారం తన సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.
-
Farminggg pic.twitter.com/RZREIOEHo4
— Salman Khan (@BeingSalmanKhan) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Farminggg pic.twitter.com/RZREIOEHo4
— Salman Khan (@BeingSalmanKhan) July 19, 2020Farminggg pic.twitter.com/RZREIOEHo4
— Salman Khan (@BeingSalmanKhan) July 19, 2020
వీడియోలో పింక్ టీ-షర్ట్, నల్లని షాట్ వేసుకుని ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు సల్మాన్. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఫొటో, వీడియోలకు 13 లక్షల వీక్షణలు లభించాయి. రైతులందరికీ గౌరవంగా ఇంతకు ముందు ఓ పోస్ట్‌ను వారికి అంకితం చేశాడు భాయ్‌జాన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
సల్మాన్‌ఖాన్ చివరిసారిగా 'దబాంగ్ 3' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత విడుదల కావాల్సిన 'రాధే' సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇందులో సల్మాన్ సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ ప్రకటన చేశాడు. ఆ చిత్రానికి 'కబీ ఈద్ కబీ దీపావళి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది.